ఏపీలో మరికొద్ది సేపట్లో భారీ వర్షం

ఏపీలో రాబోయే 3 గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕