ఏపీలోని పలు జిల్లాల్లో నవంబర్ 1, 2 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, అల్లూరి, అనకాపల్లి మరియు కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించారు. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు. నవంబర్ 2 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. విశాఖ, మచిలీపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.