ఏపీలో భారీ వర్షం

AP: తిరుపతిలో భారీ వర్షం కురిసింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు ఉప్పొంగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోఅక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్