ఏపీలో దంచికొడుతున్న వర్షం (వీడియో)

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. విజయనగరం, విశాఖ, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో వర్షం దంచికొడుతుంది. అటు రాయలసీమ ప్రాంతాల్లోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕