ఏపీలో భారీ వర్షం (వీడియో)

AP: రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో ఒకవైపు ఎండలు, మరో వైపు వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. రాజమండ్రిలో పడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొలాల్లో, చెట్ల కింద ఒంటరిగా ఉండరాదన్నారు.

సంబంధిత పోస్ట్