AP: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో, అనకాపల్లి జిల్లాలోని కె.కోటపాడు మండలంలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో రైతులను పొలాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.