AP: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో వర్షం కుండపోతగా కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలతోపాటు రహదారులు జలమయం అయ్యాయి. విజయనగరం, మన్యం, అల్లూరి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు పడుతున్నాయి. మరోవైపు విశాఖలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.