AP: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పట్టణంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా, స్థానిక రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ప్రాంగణమంతా కాలువను తలపించడంతో, రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది.