కాకినాడ జిల్లాలో దంచికొడుతున్న వర్షం

AP: తుఫాను ప్రభావంతో కాకినాడ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొడుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. తాళ్లరేవు వద్ద పరిస్థితులను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా పరిశీలించారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను తీవ్రత పెరిగేకొద్దీ సముద్రం ముందుకు చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕