విశాఖలో భారీ వర్షం

AP: అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్నంలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష గండం పొంచి ఉంది. 22 నుంచి 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారి, మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి ఇది దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోకి చేరుకునే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్ర అధికారి వెంకన్న దొర తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕