కాసేపట్లో భారీ వర్షం

AP: దక్షిణ అండమాన్ సముద్రంలో శనివారం అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి రేపు ఉ.9 గంటలలోపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నానికి అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్