భారీ వర్షం.. ఇద్దరి మృతి

AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. భారీ వర్షాలకారణంగా చర్చి వద్ద చెట్టు విరిగిపడటంతో చొక్కా కిశోర్ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో, బొండాడవారి వీధిలో విద్యుత్ స్తంభం అకస్మాత్తుగా కూలిపోవడంతో రాంబాబు (34) అనే వ్యక్తి  మృతి  చెందారు. ఈ రెండు ప్రమాదాలు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕