AP: రాష్ట్రం మీదుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈనేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అయితే ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాలో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది.