భారీ వర్షం.. జలమయమైన విజయవాడ రోడ్లు

AP: విజయవాడలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో కొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ, నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕