AP: రాష్ట్రంలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి జిల్లాలోని ముంచంగిపుట్టులో వర్షం దంచికొడుతుంది. మరోవైపు కర్నూల్ జిలాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. అటు విజయనగరం జిల్లాలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు పొలాల్లో, చెట్ల కింద ఉండరాదన్నారు.