AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులు వీయడంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.