ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం (వీడియో)

ఏపీలో ఓ వైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, గుంటూరు, కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం, ప.గో జిల్లా పాలకొల్లులో వర్షం దంచికొడుతోంది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు పొలాల్లో, చెట్ల కింద ఉండరాదని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్