ఈ నెల 5 నుంచి ఏపీలో మళ్లీ భారీ వర్షాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, నవంబర్‌ 5వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరగనుంది. మొంథా తుఫాన్‌ ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే కొత్త వర్షాల హెచ్చరికతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తేమ తగ్గడంతో ఎండ తీవ్రత పెరిగి, క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్