AP: అల్లూరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా సీలేరు కాంప్లెక్స్ జలాశయాలకు వరద పోటెత్తింది. జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుకున్నాయి. డొంకరాయి జలాశయం నుంచి 36 వేల క్యూసెక్కుల నీటిని 4 గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. అలాగే, సీలేరు జలాశయం నుంచి 3,700 క్యూసెక్కుల నీటిని 2 గేట్లు తెరిచి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వరద పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.