భారీ వర్షాలు.. ఏపీలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

AP: భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి మళ్లించారు. శంషాబాద్‌ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన స్టార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕