AP: ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రజలను అప్రమత్తం చేయాలని, నదుల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, రిజర్వాయర్లలో నీటి నిల్వలకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.