AP: రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని SDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. బంగాళాఖాతంలో ద్రోణి, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, కోనసీమ, ప.గో, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని ఆయన పేర్కొన్నారు.