ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ

AP: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడే సూచనలతో పాటు నైరుతి, పశ్చిమ గాలుల ప్రభావం వల్ల ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. కొన్ని చోట్ల గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్