ఈ జిల్లాల్లో 4 రోజులు భారీవర్షాలు..!

AP: పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది రేపటికి వాయుగుండంగా, ఆపై తీవ్ర వాయుగుండంగా బలపడి, బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకుంటుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం అల్లూరి, పోలవరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕