రాబోయే 8-10 గంటలు భారీ వర్షాలు

AP: మొంథా తుఫాన్ తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రాబోయే 8-10 గంటలు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10-20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, గంటలకు 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్