భారీ వర్షాలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

AP: బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు APSDMA అలర్ట్ జారీ చేసింది. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం శ్రీకాకుళం జిల్లాలో స్కూళ్లకు అధికారులు సెలవు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕