AP: ఎన్టీఆర్ జిల్లాలోని నున్న గ్రామీణ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో పాటు, సామ్రాజ్య రిసార్ట్ వద్ద వంతెన కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో, వరద ఉధృతిలో ఓ కారు కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు వెంటనే కారులో టీడీపీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి, ఆయన భార్యను చాకచక్యంగా కాపాడారు.