ఏపీలో నేటి నుంచి 6 రోజుల పాటు భారీ వర్షాలు

ఏపీలో నైరుతి రుతుపవనాలు దాదాపు పూర్తిగా విస్తరించనున్నాయి. జూన్ 14 నుంచి 19 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. జూన్ 17 వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండగా, గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్