ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు

ఏపీలో వారం రోజులు పాటు భారీ వర్షాలు పడునున్నట్లు తాజాగా భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 7 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని, రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలో గంటకు 50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్