ఏపీని వర్షాలు వీడటం లేదు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీంతో శనివారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడనున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రేపు ఏలూరు, అల్లూరి, గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.