ఏపీలో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండ‌చ‌రియ‌లు (వీడియో)

ఏపీలో కురుస్తున్న కుండపోత వర్షాల ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కొయ్యూరు మండలం చింతలమ్మ ఘాట్ రోడ్డులోని జాతీయ రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు ఒక్కసారిగా రోడ్డుపై పడటంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి జేసీబీల సాయంతో మట్టి, రాళ్లను తొలగించి రోడ్డును పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕