ఏపీలో భారీ వర్షాలు.. మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు

AP: ఏపీలో భారీ వర్షాలు కారణంగా, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో ఈపీడీసీఎల్‌ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా విద్యుత్‌ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ అంతరాయం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕