ఏపీలో అతిభారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ (వీడియో)

AP: ద్రోణి ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉ.గోదావరి, గుంటూరు, ఏలూరు, విజయనగరం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోనూ వానలు పడుతున్నాయి. పలు చోట్ల రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మేరకు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕