AP: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తాజాగా వెల్లడించింది. ముఖ్యంగా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.