AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కడప, నెల్లూరు, తిరుపతి, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.