రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: గడిచిన 6 గంటల్లో 6 కి.మీ వేగంతో తీవ్ర వాయుగుండం కదిలింది. ప్రస్తుతం కళింగపట్నం తీరాన్ని వాయుగుండం తాకింది. మరికొన్ని గంటల్లో వాయుగుండం పూర్తిగా తీరాన్ని దాటనుంది. దీని ప్రభావంతో ఇవాళ రాత్రి శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. 60-75 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్

✕
✕