రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కడప, తిరుపతి, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో సోమవారం విస్తారంగా వానలు కురిశాయి. మంగళవారం విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕