నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. గురువారం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్