పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే నాలుగు నుండి ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్రంలో బుధవారం ఉత్తరాంధ్ర, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.