AP: భారీ వర్షాలకు అల్లూరి జిల్లా గంగవరం గ్రామంలో రహదారులు తెగిపోయాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ప్రసవ నొప్పులు ప్రారంభమైన లావణ్య (28)ను ఆస్పత్రికి తరలించలేకపోయారు. ఇంటివద్దే శిశువుకు జన్మనిచ్చిన తర్వాత, ఆస్పత్రికి వెళ్లే దారిలేక లావణ్య కోమాలోకి వెళ్లి మృతిచెందింది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.