భారీ వర్షాలు.. అంధకారంలో శ్రీకాకుళం

AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ప్రభావంతో శ్రీకాకుళం అంధకారంలోకి వెళ్లింది. ప్రజల భద్రత కోసమే విద్యుత్ నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. అవసరం లేకుండా బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్, విశాఖలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తిరువూరు మండలం చింతలపాడులో ఇళ్ల రేకులు ఎగిరిపడి, ఐదుగురికి గాయాలయ్యాయి

సంబంధిత పోస్ట్

✕
✕