అక్టోబర్ 15 నుంచి దంచి కొట్టనున్న వర్షాలు

AP: నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్న తరుణంలో, ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల వైపు వేగంగా దూసుకు వస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు, తేమతో కూడిన గాలుల వల్ల ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరప్రాంత ప్రజలు, రైతులు ఈ వర్ష సూచనను గమనించి వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕