రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఆదివారం బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని APSDMA సూచించింది. కృష్ణా నదికి వరద తాకిడి నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.

సంబంధిత పోస్ట్