శ్రీకాకుళం జిల్లా వంగర మండలం వీవీఆర్ పేట, రాజులగుమడ గ్రామంలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తున్నాయి. పంట పొలాల వైపు వెళ్లడానికి రెండు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు చుట్టుపక్క గ్రామాలకు విద్యుత్ నిలిపివేశారు.