AP: సీఎం చంద్రబాబును విమర్శిస్తూ వైసీపీ అధినేత జగన్ సోమవారం సంచలన ట్వీట్ చేశారు. ‘రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు. గొర్రె తోలు కప్పుకున్న తోడేలు, చంద్రబాబు ఒకటే. హే రామ్.. సేవ్ ఆంధ్రా’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు పంపిణీ చాలా వరకు తగ్గిందని, ఇది స్వాగతించదగ్గ విషయమని సీఎం చంద్రబాబు అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఉద్దేశించి జగన్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.