శ్రీకాకుళం జిల్లాకు HIGH ALERT

AP: శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదులకు వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాలోని 11 తీర మండలాల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొనసాగుతోందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శ్రీకాకుళం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 08942-240557 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕