AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను రేపు తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీని ప్రభావంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ మరియు కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. తేమతో కూడిన బలమైన గాలుల వల్ల తుఫాను తీవ్రత పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.