AP: బలమైన కారణం లేకుండా పిల్లలపై డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. డీఎన్ఏ పరీక్షల వల్ల పరువు, హోదాకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వారసత్వ ఆస్తిలో వాటా కోరుతూ ఓ మహిళ దిగువ కోర్టులో దాఖలు చేసిన దావాను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి.. ఆ మహిళకు తాను తండ్రిని కానని నిరూపించుకునేందుకు ఆమెపై డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.