AP: బీసీల 34 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు బాధాకరమని మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు రాజకీయ హక్కు అని పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి టీడీపీ పునాది వేసిందని, న్యాయపోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. అవసరమైతే పార్టీ తరఫునే బీసీలకు 34 శాతం రాజకీయ అవకాశాలు కల్పిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు.