AP: పశ్చిమ గోదావరి జిల్లా, కాళ్ల మండలం, బొండాడ గ్రామంలో మద్యం MRP కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని టీడీపీ కార్యకర్త మహేష్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అధిక ధరలు వసూలు చేస్తున్నారని తేలినప్పటికీ, ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులతో చర్చలు జరిపి ఫిర్యాదును మూసివేశారని మహేష్ ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది.